Eluru: ఏలూరులో కొట్టుకున్న టీడీపీ, వైసీపీ వర్గాలు!

  • ఏజంట్ల మధ్య వాగ్వాదం
  • వైసీపీ కార్యకర్తకు తీవ్రగాయాలు
  • ఇద్దరు టీడీపీ కార్యకర్తలకు కూడా
  • చెదరగొట్టిన పోలీసులు

ఏలూరులో ఓ పోలింగ్ బూత్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. స్థానిక శనివారపుపేట ఇందిరాకాలనీ పోలింగ్ బూత్ వద్ద ఈ ఘటన జరిగింది. పోలింగ్ బూత్ ముందే ఏజంట్ల వద్ద వాగ్వాదం జరుగగా, రెండు పార్టీల వారూ ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. ఈ దాడుల్లో వైసీపీ కార్యకర్త మట్టా రాజుకు తీవ్రగాయాలు కాగా, ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలకు స్వల్పగాయాలు అయ్యాయి. పోలీసులు ఇరు వర్గాలవారినీ చెదరగొట్టారు. కాగా, గుంటూరు జిల్లా నరసరావుపేటలోనూ టీడీపీ, వైసీపీ వర్గాల ఏజంట్లూ, కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. పోలీసులు కల్పించుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. 

Eluru
Telugudesam
YSRCP
Guntur District
Polling
  • Loading...

More Telugu News