Allu Arjun: లైన్ లో నిలబడి ఓటేసి వచ్చిన అల్లు అర్జున్!

  • ఓటు వేస్తేనే మనకు ప్రశ్నించే అధికారం
  • జూబ్లీహిల్స్ లో ఓటేసిన అనంతరం అల్లు అర్జున్
  • అదే బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్న పోసాని

ఓటు వేస్తేనే మనకు ప్రశ్నించే అధికారం ఉంటుందని హీరో అల్లు అర్జున్‌ వ్యాఖ్యానించారు. పార్లమెంట్ కు జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా అల్లు అర్జున్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్, జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్ 33లోని బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫీస్‌ వద్దకు వచ్చి ఆయన ఓటేశారు. అల్లు అర్జున్ వచ్చేసరికే చాలా మంది క్యూ లైన్ లో ఉండటంతో బన్నీ సైతం చాలాసేపు వేచిచూడాల్సి వచ్చింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. అల్లు అర్జున్ తో పాటు నటుడు పోసాని కృష్ణ మురళి కూడా ఇదే పోలింగ్ బూత్ లో ఓటేశారు. వీరితో సెల్ఫీలు దిగేందుకు ఓటర్లు ఆసక్తి చూపారు.

Allu Arjun
Posani Krishna Murali
Vote
Hyderabad
Telangana
  • Loading...

More Telugu News