Visakhapatnam District: అక్కడ సీపీఎంకు ఓటేస్తే బీజేపీకి పడుతోంది...ఈవీఎంలలో సమస్య

  • విశాఖ జిల్లా అనంతగిరి మండలంలో ఘటన
  • అధికారులకు ఫిర్యాదు చేసిన ఓటర్లు
  • పోలింగ్‌ నిలిపివేసిన ప్రిసైడింగ్‌ అధికారి

విశాఖ జిల్లా అనంతగిరి మండలంలోని ఓటర్లకు ఓ పోలింగ్ బూత్ లోని ఈవీఎం షాకిచ్చింది. వారు ఒక గుర్తుకు ఓటేస్తే మరొక దానికి పడుతుండడంతో ఆశ్చర్యపోవడం వారి వంతయింది. మండలంలోని 260వ నంబరు పోలింగ్‌ బూత్‌లో ఉదయం ఏడు గంటలకు ఎప్పటిలాగే పోలింగ్‌ ప్రారంభమైంది. కొందరు ఓటర్లు సీపీఎం అభ్యర్థికి ఓటేశారు. ఆ ఓటు బీజేపీ అభ్యర్థికి పడుతుండడాన్ని గుర్తించి వెంటనే ఎన్నికల సిబ్బందికి ఫిర్యాదు చేశారు. ప్రిసైడింగ్‌ అధికారి దాన్ని పరిశీలించి సాంకేతిక సమస్యను గుర్తించారు. వెంటనే పోలింగ్‌ నిలిపివేశారు. సాంకేతిక సిబ్బందికి సమాచారం అందించారు. కాగా, ఏజెన్సీ పోలింగ్‌ కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో ఓటర్లు బారులు తీరి కనిపించడంతో ఈసారి పోలింగ్‌ శాతం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Visakhapatnam District
ananthagiri mandal
EVM
technical problem
  • Loading...

More Telugu News