amaravathi: ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ఓటేసేందుకు వెళ్లిన చోటే పనిచేయని వీవీ ప్యాట్‌

  • అమరావతి తాడేపల్లి క్రిస్టియన్‌పేట మున్సిపల్‌ హైస్కూల్‌లో సమస్య
  • రాష్ట్ర వ్యాప్తంగా 50 చోట్ల సమస్య గుర్తించినట్లు ద్వివేది వెల్లడి
  • సాంకేతిక సిబ్బంది అందుబాటులో ఉన్నారని వివరణ

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌లో పలుచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. సాక్షాత్తు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది ఓటేసేందుకు వెళ్లిన చోటే సమస్య ఎదురైంది. గురువారం ఉదయం ద్వివేది అమరావతిలోని తాడేపల్లి క్రిస్టియన్‌పేట మున్సిపల్‌ హైస్కూల్‌లో ఓటు వేసేందుకు వెళ్లారు. ఆయన ఓటేసిన సందర్భంలో అక్కడ ఏర్పాటు చేసిన వీవీప్యాట్‌ పనిచేయ లేదు.

దీనిపై స్పందించిన ద్వివేది మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా యాభై పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంలు లేదా వీవీ ప్యాట్‌లు మొరాయించినట్లు సమాచారం వచ్చిందని తెలిపారు. సాంకేతిక సిబ్బంది అందుబాటులో ఉన్నారని, వాటికి మరమ్మతులు జరిపి అందుబాటులోకి తెస్తారని వివరించారు. ప్రజలంతా నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. సాయంత్రం ఆరు గంటల సమయానికి పోలింగ్‌ బూత్‌ వద్దకు చేరుకున్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించనున్నట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News