Jagan: భార్య భారతితో కలసివెళ్లి ఓటేసి వచ్చిన వైఎస్ జగన్!

  • భాకరాంపురం స్కూల్ కు వచ్చిన జగన్
  • కాసేపు క్యూలో ఉండి ఓటు హక్కు వినియోగం
  • ఏర్పాట్లెలా ఉన్నాయని అడిగి తెలుసుకున్న జగన్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్, కొద్దిసేపటిక్రితం పులివెందులలోని భాకరాంపురం ఎంపీపీఎస్ స్కూల్ లో ఓటేశారు. జగన్ తో పాటు ఆయన భార్య భారతి కూడా వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జగన్ వెళ్లే సమయానికే పోలింగ్ బూత్ వద్ద పలువురు ఓటర్లు ఉండటంతో, కాసేపు జగన్ దంపతులు క్యూలో నిలుచోవాల్సి వచ్చింది. ఈ సందర్భంగా పోలింగ్ ఏర్పాట్లు ఎలావున్నాయని ఓటర్లను జగన్ అడిగి తెలుసుకున్నారు. ప్రిసైడింగ్ అధికారులనూ పలకరించిన ఆయన, వారికి కల్పించిన సదుపాయాలపై ఆరా తీశారు.

Jagan
Bharati
Vote
  • Loading...

More Telugu News