vizianagaram: విజయనగరంలో ఓటేసిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు అశోక్‌గజపతి, అదితి గజపతి

  • అందరూ ఓటేయాలని పిలుపు
  • ఏపీలో ఉదయం నుంచే భానుడి ప్రతాపం
  • పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు ఏర్పాటు

ఏపీలో పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఎదురుచూస్తున్నారు. భానుడు ఉదయం నుంచే ప్రతాపం చూపిస్తుండడంతో పొద్దెక్కకముందే ఓటేయాలన్న ఉద్దేశంతో ఓటర్లు వడివడిగా కేంద్రాలకు చేరుకుంటుండడంతో పోలింగ్ కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి.

విజయనగరంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి అశోక్ గజపతిరాజు, ఎమ్మెల్యే అభ్యర్థి అదితి గజపతి రాజులు కొద్దిసేపటి క్రితం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని పిలుపు నిచ్చారు. కాగా నేడు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉండడంతో అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. చాలాప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీటిని ఏర్పాటు చేశారు. ఓటర్లు వడదెబ్బకు గురికాకుండా టెంట్లు వేశారు.

vizianagaram
Andhra Pradesh
Ashok gajapati raju
aditi gajapati raju
  • Loading...

More Telugu News