Jagan: పులివెందులలో ఓటు హక్కు వినియోగించుకోనున్న వైఎస్ జగన్

  • ఏపీలో ప్రారంభమైన పోలింగ్
  • ఉదయం ఏడున్నర గంటలకు ఓటేయనున్న జగన్
  • గట్టి భద్రతా చర్యలు చేపట్టిన పోలీసులు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కడప జిల్లాలోని పులివెందులలో తన ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం ఏడున్నర గంటలకు పోలింగ్ బూత్‌కు చేరుకోనున్న ఆయన ఓటు వేయనున్నారు. నియోజకవర్గంలోని భాకరాంపురం ఎంపీపీఎస్ స్కూల్ భవనంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో జగన్ తన ఓటు హక్కు వినియోగించుకుంటారని వైసీపీ వర్గాలు తెలిపాయి.

దేశవ్యాప్తంగా తొలి దశ ఎన్నికల పోలింగ్ సిద్ధమైంది. మరికొన్ని క్షణాల్లో పోలింగ్ ప్రారంభం కానుండగా, ఎన్నికల సంఘం పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తిస్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేసింది. తొలి దశ ఎన్నికల్లో భాగంగా 18 రాష్ట్రాల్లోని 91 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. 

Jagan
YSRCP
Kadapa District
Pulivendula
vote
  • Loading...

More Telugu News