Andhra Pradesh: టీడీపీ నేత పల్లె రఘునాథరెడ్డికి అస్వస్థత
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-f9def5ee354ecf8fd336e659e7edbd2e7c4cd870.jpg)
- భార్య సమాధి వద్ద నివాళులర్పించేందుకు వెళ్లిన పల్లె
- ఆ సమయంలో అస్వస్థతకు గురి
- ఆసుపత్రికి తరలించిన బంధువులు
అనంతపురం జిల్లా పుట్టపర్తి టీడీపీ అభ్యర్థి పల్లె రఘునాథరెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. భార్య ఉమాదేవి సమాధి వద్దకు నివాళులర్పించేందుకు వెళ్లిన ఆయన అక్కడే కుప్పకూలిపోయినట్లు సమాచారం. వెంటనే, రఘునాథరెడ్డి బంధువులు, అనుచరులు ఆయన్ని ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది. పల్లెకు గుండెపోటు వచ్చినట్లు సమాచారం. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ప్రకటన చేసే అవకాశం ఉంది. కాగా, గత ఏడాది ఆగస్టులో రఘునాథరెడ్డి భార్య ఉమాదేవి అనారోగ్యంతో మృతి చెందారు.