Secunderabad: బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలంటూ పిటిషన్!

  • ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆరోపణలు
  • హైకోర్టులో పిటిషన్ వేసిన తలసాని ఎన్నికల ఏజెంట్  
  • కిషన్ రెడ్డి, అమిత్ షా, లక్ష్మణ్ పై చర్యలకు వినతి

సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కిషన్ రెడ్డి ని అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.  అదే నియోజక వర్గం నుంచి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తలసాని సాయికిరణ్ ఎన్నికల ఏజెంట్ పవన్ కుమార్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. బ్యాంకు నుంచి కిషన్ రెడ్డి రూ.8 కోట్లు విత్ డ్రా చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఓటరు స్లిప్పులతో పాటు బీజేపీ సిద్ధాంతాలను ప్రచారం చేస్తున్నారని కిషన్ రెడ్డిపై ఆరోపించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కిషన్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, అదే విధంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ పైనా చర్యలు తీసుకోవాలని ఆ పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ పై శుక్రవారం విచారణ జరగనున్నట్టు సమాచారం.

Secunderabad
Bjp
kishan reddy
High Court
  • Loading...

More Telugu News