Andhra Pradesh: ‘వీవీ ప్యాట్స్ ఎందుకు పెట్టుకున్నట్టు? పోలింగ్ బూత్ సాలార్ జంగ్ మ్యూజియం కాదుగా?: ప్రొఫెసర్ నాగేశ్వర్
- వీవీ ప్యాట్ మిషన్లు అలంకరణ యంత్రాలు కాదు
- ప్రజలకు విశ్వాసం కల్పించేందుకే అవి ఉన్నాయి
- ఇందులో ఓట్లను లెక్కపెడితే జరిగే నష్టమేమీ లేదు
‘వీవీ ప్యాట్ మిషన్లను ఎందుకు పెట్టుకున్నట్టు? పని లేక షోకులకు పెట్టుకున్నారా? పోలింగ్ బూత్ అనేది సాలార్ జంగ్ మ్యూజియం కాదు కదా? అని ప్రశ్నించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘వీవీ ప్యాట్ మిషన్లు అలంకరణ యంత్రాలు కాదు. అవి డెకరేషన్ కాదు. ప్రజలకు విశ్వాసం కల్పించేందుకే ఆ యంత్రాలు ఉన్నాయి. ఆ విశ్వాసం కల్పించాలంటే సబ్ స్టాన్షియల్ నెంబర్ లెక్కపెట్టాలి. ఆ నెంబర్ ఒకటో రెండో కాదు, ప్రజలకు, పోటీదారులకు విశ్వాసం ఉండే స్థాయిలో లెక్కపెట్టాలి. వీవీప్యాట్స్ లో ఓట్లను లెక్కపెట్టడం వల్ల జరిగే నష్టమేమీ లేదు. ఎన్నికల ఫలితాలు వెలువడటం ఓ ఆరు రోజులు ఆలస్యం అవుతుంది తప్ప, కొంపలేమీ మునగవుగా’ అని ప్రశ్నించారు.