prakasm district: కరణం బలరాం కొడుకు పీఎపై కత్తులతో దాడి

  • ప్రకాశం జిల్లా చీరాలలో ఘటన
  • కరణం బలరాం వియ్యంకుడి ఆసుపత్రి వద్ద దాడి
  • వెంకటేశ్ పీఏ గోగులమూడి రాజశేఖర్ చేతికి గాయం

ప్రకాశం జిల్లా చీరాలలో టీడీపీ కార్యకర్తపై యువకులు దాడికి పాల్పడ్డారు. చీరాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కరణం బలరాం కొడుకు వెంకటేశ్ కు పీఏగా ఉన్న గోగులమూడి రాజశేఖర్ పై దాడి జరిగింది. కరణం బలరాం వియ్యంకుడి ఆసుపత్రి వద్ద ఈ దాడి జరిగినట్టు సమాచారం. ఆసుపత్రి లోపల వెంకటేశ్ ఉండగా, రాజశేఖర్, తన స్నేహితుడితో కలిసి బయట నిలబడి ఉన్నారు.

అనుమానాస్పదంగా అక్కడే తిరుగుతున్న యువకులను గమనించిన రాజశేఖర్, వారిని ప్రశ్నించినట్టు సమాచారం. దీంతో, ఆ యువకులు రాజశేఖర్, అతనితో ఉన్న వ్యక్తిపై కత్తులతో దాడికి పాల్పడినట్టు సమాచారం. ఈ దాడిలో రాజశేఖర్ చేతికి తీవ్ర గాయమైంది. నిందితులను పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించినట్టు తెలుస్తోంది. కాగా, ఈ దాడి వైసీపీ కార్యకర్తలే చేశారని టీడీపీ కార్యర్తలు ఆరోపిస్తున్నారు.

prakasm district
Telugudesam
karanam
balaram
  • Loading...

More Telugu News