West Godavari District: వైసీపీ నేతలు డబ్బు పంచుతుండగా అడ్డుకున్న టీడీపీ.. దెందులూరులో ఉద్రిక్తత

  • ప్రలోభాలకు తెరదీసిన పార్టీలు
  • టీడీపీ, వైసీపీల మధ్య ఘర్షణ
  • పరిస్థితిని అదుపు చేసిన పోలీసులు

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గ పరిధిలోని యాగనమిల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రస్తుతం పార్టీలన్నీ ప్రలోభాలకు తెరలేపుతుండటంతో గొడవలు జరుగుతున్నాయి. తాజాగా వైసీపీ కార్యకర్తలు డబ్బులు పంచుతుండగా టీడీపీ నేతలు అడ్డుకోవడంతో యాగనమిల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం కాస్తా తీవ్ర ఘర్షణకు దారి తీసింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన జిల్లా కేంద్రం నుంచి భారీగా బలగాలను రప్పించి పరిస్థితిని అదుపు చేశారు.


West Godavari District
Denduluru
Telugudesam
YSRCP
Police
  • Loading...

More Telugu News