Supreme Court: సుప్రీంకోర్టు స్పందన చాలా సంతోషాన్నిచ్చింది: రాహుల్ గాంధీ
- రాఫెల్ డీల్ పై సుప్రీం స్పందనను స్వాగతిస్తున్నాం
- కాపలాదారుడే దొంగ అని సుప్రీం చెప్పినట్టైంది
- రాఫెల్ అసలు నిజాలను దేశం తెలుసుకోవాలనుకుంటోంది
దేశ రాజకీయాల్లో ప్రకంపనలు రేపిన రాఫెల్ యుద్ధ విమానాల డీల్ అంశంపై వేసిన రిట్ పిటిషన్లపై విచారణ జరుపుతామని ఈరోజు సుప్రీంకోర్టు తెలిపిన సంగతి తెలిసిందే. విచారణ తేదీలను త్వరలోనే తెలుపుతామని చెప్పింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ స్పందిస్తూ, సుప్రీంకోర్టు నిర్ణయం ఎంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. రాఫెల్ ఒప్పందం ద్వారా అనిల్ అంబానీకి వేల కోట్ల రూపాయలను మోదీ దోచిపెట్టారని విమర్శించారు. కాపలాదారుడే దొంగ అని సుప్రీం చెప్పినట్టైందని అన్నారు. ఈ విషయంపై మోదీతో ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. రాఫెల్ డీల్ వెనుక ఉన్న అసలైన నిజాలను తెలుసుకోవాలని దేశం మొత్తం ఎదురుచూస్తోందని చెప్పారు.