KCR: కేసీఆర్ పై ఫిర్యాదు.. నోటీసులు పంపిన ఎన్నికల సంఘం

  • కరీంనగర్ లో అనుచిత వ్యాఖ్యలు చేశారు
  • హిందువులను కించపరిచారు
  • ఫిర్యాదు చేసిన వీహెచ్ పీ

ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎన్నికల సంఘం నోటీసులు పంపింది. మార్చి 17న కరీంనగర్ లో జరిగిన ఓ బహిరంగ సభలో కేసీఆర్ హిందువుల పట్ల అవమానకర రీతిలో మాట్లాడారంటూ విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) తెలంగాణ విభాగం అధ్యక్షుడు రామరాజు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలు ఎన్నికల నియమావళికి విరుద్ధమని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రామరాజు ఫిర్యాదును పరిశీలించిన ఈసీ ఆ మేరకు చర్యలు తీసుకుంది. ఏప్రిల్ 12వ తేదీ సాయంత్రం ఐదింటి లోపల తమకు వివరణ ఇవ్వాలంటూ సీఎం కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది.

KCR
Telangana
Karimnagar District
  • Loading...

More Telugu News