Andhra Pradesh: కేంద్ర ఎన్నికల సంఘంపై నిప్పులు చెరిగిన సీపీఐ నేత రామకృష్ణ!

  • ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోంది
  • అధికార పార్టీ చెప్పినట్లు నడుచుకుంటోంది
  • ఈ విషయమై ఇప్పటికే రాష్ట్రపతికి ఫిర్యాదు చేశాం

కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)పై సీపీఐ నేత రామకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. అధికారంలో ఉన్న పార్టీ చెప్పినట్లు ఈసీ పనిచేస్తోందని దుయ్యబట్టారు. విజయవాడలోని సీపీఐ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడారు.

ఈసీ వ్యవహారశైలిపై తాము రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. ఈసీ ఇప్పటికైనా నిష్పాక్షికంగా, పారదర్శకతతో వ్యవహరించాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో ఏపీలో జనసేన-వామపక్షాలు-బీఎస్పీ కూటమి అధికారంలోకి రావడం తథ్యమని జోస్యం చెప్పారు.

Andhra Pradesh
cpi
ramakrishna
ec
President Of India
complaint
  • Loading...

More Telugu News