Vijayawada: విజయవాడ సెంట్రల్ లో 20 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్

  • ఏపీలో ఏరులై పారుతున్న డబ్బులు
  • వైసీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • భారీ ఎత్తున నగదు స్వాధీనం

పోలింగ్ నేపథ్యంలో ఏపీలో వివిధ పార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నాయి. మందు, డబ్బు ఏరులై పారుతున్నాయి. తాజాగా విజయవాడ సెంట్రల్ లో 20 మంది వైసీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓటర్లకు డబ్బును పంపిణీ చేస్తుండగా వారిని పట్టుకున్నారు. వారి నుంచి పెద్ద మొత్తంగా నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్నవారిలో పలువురు వైసీపీ డివిజన్ కమిటీ ప్రెసిడెంట్లుగా కూడా ఉన్నారు.

Vijayawada
central
money
ysrcp
arrest
  • Loading...

More Telugu News