Andhra Pradesh: టీడీపీ నేత బోండా ఉమపై కేసు పెట్టండి.. ఏపీ పోలీసులకు హైకోర్టు ఆదేశం!

  • న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సాయిశ్రీ తల్లి
  • తన కుమార్తె చావుకు ఆయనే కారణమని ఆరోపణ
  • మూడుసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు పెట్టలేదని వ్యాఖ్య

టీడీపీ నేత, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుకు షాక్ తగిలింది. సుమశ్రీ అనే మహిళ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన ఏపీ హైకోర్టు.. ఉమపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ సందర్భంగా పిటిషనర్ సుమశ్రీ న్యాయవాది కోర్టులో వాదిస్తూ.. తమ క్లయింట్ పోలీసులకు మూడు సార్లు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని తెలిపారు.

విజయవాడ నగరంలోని దుర్గాపురంలో ఉన్న సుమశ్రీ ఇంటిని బోండా ఉమ, మాదంశెట్టి శివకుమార్ లాక్కోవడంతోనే ఆమె కుమార్తె సాయిశ్రీ కేన్సర్ చికిత్సకు డబ్బులు లేక 2017, మే 14న చనిపోయిందని ఆరోపించారు. బోండా ఉమతో సుమశ్రీ ప్రాణాలకు ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. వాదనలు విన్న ధర్మాసనం బోండా ఉమామహేశ్వరరావుపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది.

Andhra Pradesh
Telugudesam
uma
Bonda Uma
High Court
Police
case
  • Loading...

More Telugu News