Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ విక్రమ్ నాథ్!

  • పలు నియామకాలకు కొలీజియం ఆమోదం
  • ఛత్తీస్ గఢ్ సీజేగా రామచంద్ర మీనన్
  • ఏకే మిట్టల్ ను మేఘాలయ సీజేగా నియమిస్తున్నట్లు ప్రకటన

సుప్రీంకోర్టు కొలీజియం ఈరోజు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అలహాబాద్ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ నాథ్ ను నియమించింది. అలాగే కేరళ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి పీఆర్ రామచంద్ర మీనన్ ను ఛత్తీస్ గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించింది.

పంజాబ్-హరియాణా హైకోర్టు న్యాయమూర్తి ఏకే మిట్టల్ ను మేఘాలయ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. న్యాయమూర్తులను ఎంపిక చేసేందుకు నిర్దేశించిన వ్యవస్థే ఈ కొలీజియం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో నలుగురు సీనియర్ జడ్జీలు ఇందులో సభ్యులుగా ఉంటారు. 

  • Loading...

More Telugu News