Andhra Pradesh: ఎన్నికల నిబంధనలను అతిక్రమించారంటూ.. తెలంగాణ మంత్రి తలసాని, ఆయన కుమారుడిపై కేసు నమోదు!

  • రెజిమెంట్ బజార్ లో నిన్న ప్రార్థనలు
  • సభకు హాజరైన తలసాని, కిరణ్ యాదవ్
  • తమకు ఓటేయాల్సిందిగా కోరినట్లు ఫ్లయింగ్ స్వ్కాడ్ ఇన్‌ఛార్జ్ ఫిర్యాదు

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, ఆయన కుమారుడు  టీఆర్ఎస్ సికింద్రాబాద్ లోక్ సభ అభ్యర్థి సాయికిరణ్ పై కేసు నమోదయింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనుమతి లేకుండా వీరిద్దరూ పాఠశాలలో సభను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ లోని రెజిమెంటల్‌ బజార్ పరిధిలో తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన తలసాని, సాయికిరణ్ నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఈ సభలో తమకు ఓటేయాల్సిందిగా సభికులను వీరిద్దరూ కోరినట్లు తెలుస్తోంది. ప్రార్థనల కోసం అనుమతి తీసుకుని ఎన్నికల ప్రచారానికి వినియోగించడంపై ఫ్లయింగ్ స్వ్కాడ్ ఇన్‌ఛార్జ్ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు తలసాని శ్రీనివాస్ యాదవ్, సాయికిరణ్ యాదవ్, ఎమ్మెల్సీ రాజేశ్వరరావు, కార్పోరేటర్ ఆకుల రూప, క్రిస్టియన్ కౌన్సిల్ బిషప్ గొల్లపల్లి జాన్‌పై  పోలీసులు కేసు నమోదు చేశారు.

Andhra Pradesh
Telangana
Telangana Election 2019
Talasani
TRS
ec
Police
caee
  • Loading...

More Telugu News