Tamilnadu: ముస్లిం యువతితో శింబు సోదరుడి పెళ్లి.. రజనీకాంత్ కు ఆహ్వానం!

  • ఈనెల 26న చెన్నైలో నిఖా
  • ఇటీవల ఇస్లాం స్వీకరించిన కురలరసన్‌
  • తమ్ముడి పెళ్లిపై హర్షం వ్యక్తంచేసిన శింబు

కోలీవుడ్ హీరో శింబు సోదరుడు, సంగీత దర్శకుడు కురలరసన్‌ ఇటీవల ఇస్లాం మతాన్ని స్వీకరించాడు. ముస్లిం మతానికి చెందిన ప్రియురాలిని పెళ్లాడేందుకే కురలరసన్‌ ఇస్లాం స్వీకరించినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఆయన వివాహం ఈ నెల 26న చెన్నైలో జరగుతుందని కురలరసన్‌ కుటుంబ సభ్యులు తెలిపారు.

నిబిలా అహ్మద్ అనే యువతి, కురలరసన్‌ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరి వివాహానికి ఇరు కుటుంబాలు అంగీకరించాయి. కాగా, సోదరుడి వివాహంపై శింబు సంతోషం వ్యక్తం చేశాడు. మరోవైపు కురలరసన్‌ తండ్రి, దర్శక-నిర్మాత టి.రాజేందర్ పెళ్లి పత్రికలు పంచడంలో బిజీగా ఉన్నారు. తాజాగా రాజేందర్ కుమారుడు కురలరసన్‌ తో కలిసి సూపర్ స్టార్ రజనీకాంత్ కు పెళ్లి పత్రికను అందజేశారు.

Tamilnadu
kollywood
simbu
brother
marriage
islam
  • Loading...

More Telugu News