dalai lama: అస్వస్థతకు గురైన దలైలామా.. ఢిల్లీ ఆసుపత్రిలో చికిత్స
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-104a4b529857884cbc656d8ce25a9cda9b0c9012.jpg)
- ఛాతీ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న దలైలామా
- మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బౌద్ధ మత గురువు
- ప్రస్తుతం నిలకడగానే ఉన్న ఆరోగ్యం
బౌద్ధ గురువు దలైలామా అస్వస్థతకు గురయ్యారు. ఛాతీ ఇన్ఫెక్షన్ తో ఆయన బాధ పడుతున్నారు. దీంతో, ఆయనను ఢిల్లీలోని మ్యాక్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఓ ప్రత్యేక వైద్య బృందం ఆయనను పర్యవేక్షిస్తోందని దలైలామా అధికార ప్రతినిధి తెన్ జిన్ తక్లా చెప్పారు. ఒకటి, రెండు రోజుల పాటు ఆసుపత్రిలోనే దలైలామా ఉంటారని తెలిపారు.