Kadapa District: కడపలో టీడీపీ మహిళా కార్యకర్త కిడ్నాప్.. నిడిజిని గనుల వద్ద వదిలేసిన కిడ్నాపర్లు

  • వలసపల్లికి చెందిన పద్మావతి కిడ్నాప్
  • పోలీసులు గుర్తించడంతో వాహనంలోనే వదిలివెళ్లిన నిందితులు
  • బాధితురాలిని ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించిన పోలీసులు

కడపలో కిడ్నాప్‌కు గురైన టీడీపీ మహిళా కార్యకర్త పద్మావతి ఆచూకీ లభ్యమైంది. నిడిజిని గనుల వద్ద పోలీసులు ఆమెను గుర్తించారు. జిల్లాలోని ఎర్రగుంట్ల మండలం, వలసపల్లికి చెందిన పద్మావతి అకస్మాత్తుగా అదృశ్యమైంది. ఆమె కోసం గాలించినప్పటికీ ఫలితం లేకపోవడంతో కిడ్నాప్‌నకు గురై ఉంటుందని భావించిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు పద్మావతి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో నిడిజిని గనుల వద్ద ఓ వాహనంలో ఉన్న ఆమెను పోలీసులు గుర్తించారు. తమ ఆచూకీని పోలీసులు గుర్తించిన విషయాన్ని గమనించిన కిడ్నాపర్లు ఆమెను వాహనంలోనే వదిలేసి పరారయ్యారు. అనంతరం పద్మావతిని వెతికి పట్టుకున్న పోలీసులు ఆమెను ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. నిందితుల కోసం వేట ప్రారంభించామని, కిడ్నాప్‌నకు గల కారణాలపై ఆరాతీస్తున్నామని పోలీసులు తెలిపారు.

Kadapa District
Telugudesam worker
kidnap
Andhra Pradesh
  • Loading...

More Telugu News