Congress: రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ అభ్యర్థి రమేశ్ రాథోడ్‌కు తీవ్ర గాయాలు.. ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలింపు

  • ప్రచారం ముగించుకుని వస్తుండగా ప్రమాదం
  • తలకు తీవ్ర గాయాలు
  • ఆదిలాబాద్ ఎంపీ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి

ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొనడంతో రమేశ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. రాథోడ్ ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా ఆదిలాబాద్‌లోని మావల వద్ద గత రాత్రి ఈ ప్రమాదం జరిగింది. రోడ్డుకు అడ్డంగా వచ్చిన పందిని తప్పించే క్రమంలో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదంలో రాథోడ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే ఆయనను ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

2009 ఎన్నికల్లో టీడీపీ టికెట్‌పై ఆదిలాబాద్ నుంచి ఎన్నికైన రాథోడ్ 2015లో టీఆర్ఎస్‌లో చేరారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్ టికెట్ ఆశించి భంగపడిన ఆయన పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరారు. ఈ ఎన్నికల్లో ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.

Congress
Telangana
Adilabad District
Ramesh rathod
Road Accident
  • Loading...

More Telugu News