secunderabad: సికింద్రాబాద్-విజయవాడ మధ్య ప్రత్యేక రైళ్లు!
- ఈరోజు నుంచి 15 వరకు ప్రత్యేక రైళ్లు
- సాధారణ బోగీలతో నడిచే జన్ సాధారణ్ రైళ్లు
- ఎల్లుండి రాత్రి నర్సాపూర్ - సికింద్రాబాద్ కు ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైలు
ఓటు వేసేందుకు తమ గ్రామాలకు వెళ్లి వచ్చే వారి కోసం రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈరోజు నుంచి 15వ తేదీ వరకు సికింద్రాబాద్-విజయవాడ మధ్య ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్టు డీఆర్ఎం ధనుంజయులు తెలిపారు. సాధారణ బోగీలతో నడిచే జన్ సాధారణ్ రైళ్లను ఏర్పాటు చేశారు.
ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ నుంచి విజయవాడకు ఈ రైళ్లు బయలుదేరతాయి. విజయవాడ నుంచి రాత్రి 8.25 గంటలకు ఈ రైళ్లు తిరిగి బయలు దేరి సికింద్రాబాద్ వస్తాయి. కాగా, ఎల్లుండి రాత్రి 7.30 గంటలకు నర్సాపూర్ నుంచి సికింద్రాబాద్ కు ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైలును రైల్వేశాఖ నడపనుంది. ప్రత్యేక రైళ్లలో ముందస్తు రిజర్వేషన్ సదుపాయం ఉన్నట్టు తెలిపింది.