Revanth Reddy: ప్రతీ యువకుడు వందమంది ఓటర్లతో ఓటు వేయించాలి: రేవంత్ రెడ్డి

  • గెలిపిస్తే టీఆర్ఎస్‌ను ప్రశ్నించే గొంతుకనవుతా
  • బంధువులను పోలింగ్ కేంద్రాలకు తీసుకు రావాలి
  • అంతా కంకణబద్ధులై పోలింగ్ బూత్‌లకు రావాలి

యువ నేతలతో పాటు సోదరీమణులు, అంతా కంకణబద్ధులై పోలింగ్ బూత్‌లకు తరలి రావాలని మల్కాజ్‌గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నేడు ఎల్బీ నగర్‌ నియోజకవర్గంలోని నాగోల్‌లో రోడ్ షో నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనను గెలిపిస్తే టీఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకనవుతానన్నారు.

ఆడపడుచులు వారి బంధువులతో పాటు మిత్రులను పోలింగ్ కేంద్రాలకు తీసుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క యువకుడు ఉదయం ఏడు గంటల కల్లా కనీసం వంద మంది ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లి ఓటు వేయించాలని రేవంత్ కోరారు.

Revanth Reddy
Polling Booth
Malkajgiri
TRS
Congress
  • Loading...

More Telugu News