బన్నీ బర్త్ డే సందడి.. వర్షంలో సైతం తరలివచ్చిన అభిమానులు!
- 36వ పుట్టినరోజును జరుపుకున్న బన్నీ
- వర్షంలోనే ఫ్యాన్స్‌ని పలకరించేందుకు డాబాపైకి బన్నీ
- మొక్కల్ని కానుకగా ఇచ్చిన సినీ ప్రముఖులు
బన్నీని చూసిన అభిమానులు ఆనందంతో ఊగిపోయారు. ఈ సందర్భంగా తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా బన్నీకి పలువురు ప్రముఖులు కూడా మొక్కల్ని కానుకగా ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. బన్నీని స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్, సుకుమార్, హరీష్ శంకర్, మారుతి, శ్రీరామ్ వేణు తదితరులున్నారు.