Chandrababu: నిన్నటి దాకా ఓట్ల దొంగలు వచ్చారు, ఇప్పుడు ఈవీఎం దొంగలు తయారయ్యారు: చంద్రబాబు

  • వీవీ ప్యాట్ స్లిప్ ను చెక్ చేసుకోండి
  • పార్టీ గుర్తు, అభ్యర్థి ఫొటో సరిపోల్చుకోండి
  • తాడికొండ రోడ్ షోలో చంద్రబాబు ప్రసంగం

తాడికొండ రోడ్ షోతో సీఎం చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారాన్ని ముగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిన్నటిదాకా ఓట్ల దొంగలు వచ్చారని, ఇప్పుడు ఈవీఎం దొంగలు తయారయ్యారని అన్నారు. మీరు ఎవరికి ఓటేసినా అది కేసీఆర్ కో, మోదీకో, కోడికత్తికో వెళుతుందని, ఈ విధంగా జరిగే మోసాలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఓటు వేసిన అనంతరం మీరు ఎవరికి ఓటేశారో ఆ పార్టీ గుర్తు, అభ్యర్థి ఫొటో వీవీ ప్యాట్ నుంచి వచ్చిన స్లిప్పులో ఉన్నాయో లేదో ఓసారి తనిఖీ చేసుకోవాలని విడమర్చి చెప్పారు.

ఈవీఎం మోసాలను దృష్టిలో ఉంచుకుని 50 శాతం వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాలని తాను డిమాండ్ చేశానని, అయితే ఎన్నికల సంఘం వీలుకాదని చెప్పడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించినట్టు వెల్లడించారు. ఓ నియోజకవర్గంలో 5 బూత్ ల్లోనే లెక్కిస్తామని చెప్పారని, ఇది కూడా చాలదని, దీనిపై మళ్లీ రివ్యూ పిటిషన్ వేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. కనీసం 25 పోలింగ్ బూత్ లన్నా లెక్కించాలని కోరతామని తెలిపారు.

  • Loading...

More Telugu News