YSRCP: జగన్ లా దొడ్డిదారిన రాను.. నాది ధర్మ ద్వారం: పవన్ కల్యాణ్

  • దొడ్డి దారి, దగ్గర దారిని నేను వెతకను
  • కష్టమైనా, నష్టమైనా సరే ధర్మ ద్వారం గుండా వస్తా
  • టీడీపీ, వైసీపీ కుట్ర రాజకీయాలకు భయపడను

దొడ్డి దారి, దగ్గర దారిని తాను వెతకనని, కష్టమైనా, నష్టమైనా సరే, ధర్మ ద్వారం ద్వారానే వస్తానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ అధినేత జగన్ లా దొడ్డి దోవలో రానని స్పష్టం చేశారు.

‘నేను గుడి మెట్ల దగ్గర ఉండే యాచకుడి లాంటి వాడిని. నా చేతిలో ఎంత వస్తుందో అంతతోనే తృప్తి పడతా’ అని వ్యాఖ్యానించారు. టీడీపీ, వైసీపీ కుట్ర రాజకీయాలకు తాను భయపడనని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. బీజేపీ నేతలవి అవకాశవాద రాజకీయాలని, హిందూత్వ బీజేపీ జగన్ కు ఎలా సపోర్ట్ చేస్తుంది? అని ప్రశ్నించారు. మోదీ అంటే తనకు భయం లేదని, తాను ధైర్యంతో రాజకీయాలు చేస్తున్నానని, రాజకీయాల్లో మార్పులు కోరుకుంటున్నానని అన్నారు.

YSRCP
jagan
janasena
Pawan Kalyan
bhimavaram
West Godavari District
Telugudesam
  • Loading...

More Telugu News