Nagari: జగన్ ఏపీ సీఎం కావడం ఖాయం: వైసీపీ నేత రోజా

  • రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి ఘన స్వాగతం లభిస్తోంది
  • ప్రజల పక్షాన నిలబడి పోరాడాం
  • అసెంబ్లీలో ఉన్న దొంగలను నిలదీశాం

జగన్ ఏపీ సీఎం కావడం ఖాయమని వైసీపీ ఎమ్మెల్యే రోజా ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో తన నియోజకవర్గం నగరిలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ, 2014 ఎన్నికల్లో జగన్ విజయం తథ్యమని తెలిసి చంద్రబాబు నక్కజిత్తుల, నీతిమాలిన రాజకీయాలు ఎలా చేశారో ప్రజలందరికీ తెలుసని అన్నారు. ఎక్కడికి వెళ్లినా కూడా మళ్లీ తాను గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. కేవలం, నగరి నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి ఘన స్వాగతం లభిస్తోందని అన్నారు.

తమ పార్టీ అధికారంలో లేకపోయినా, ప్రజల పక్షాన నిలబడి, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారికి భరోసా కల్పిస్తున్నామని చెప్పారు. ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రజల కష్టాలను వారి ద్వారానే వైఎస్ జగన్ తెలుసుకున్నారని అన్నారు. అసెంబ్లీలో ఎవరైతే దొంగలున్నారో వారిని నిలదీశామని, రాష్ట్ర  ప్రజలకు వాళ్లు ఎటువంటి మంచి కార్యక్రమాలు చేయలేదని, ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు.

Nagari
mla
roja
YSRCP
jagan
nara
  • Loading...

More Telugu News