Andhra Pradesh: టీడీపీ రూ.15,000 కోట్లు ఖర్చు పెడుతోంది.. ఒక్క కడప ఎంపీ సీటుకే 300 కోట్లు పెడుతున్నారు!: జీవీఎల్ సంచలన ఆరోపణలు

  • ఏపీ ఎన్నికల్లో టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదు
  • రాష్ట్రమంతటా టీడీపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి
  • మీడియాతో మాట్లాడిన బీజేపీ నేత

త్వరలోనే జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని బీజేపీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు జోస్యం చెప్పారు. ఏపీ అంతటా ప్రస్తుతం టీడీపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని వ్యాఖ్యానించారు కడప జిల్లాలో ఈరోజు బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జీవీఎల్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

రాబోయే ఎన్నికల్లో టీడీపీకి కడప జిల్లాలో ఒక్క సీటు కూడా దక్కదని వ్యాఖ్యానించారు. ఒక్క కడప లోక్ సభ సీటు కోసం టీడీపీ ఏకంగా రూ.300 కోట్లు ఖర్చు చేస్తోందని ఆరోపించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ రూ.15,000 కోట్లను ఖర్చు చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రంలో ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ మరోసారి అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పారు.

Andhra Pradesh
assembly
Telugudesam
BJP
gvl
Kadapa District
  • Loading...

More Telugu News