ntr: రాజమౌళి దృష్టిలో ఆ ఇద్దరు బాలీవుడ్ భామలు

- ప్రాజెక్టు నుంచి తప్పుకున్న డైసీ ఎడ్గర్ జోన్స్
- మరో హీరోయిన్ కోసం వెతుకులాట
- శ్రద్ధా కపూర్ కి ప్రాధాన్యత
రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' సినిమా రూపొందుతోంది. ఎన్టీఆర్ .. చరణ్ కథానాయకులుగా నటిస్తోన్న ఈ సినిమాలో చరణ్ జోడీగా అలియా భట్ ను తీసుకున్నారు. ఇక ఎన్టీఆర్ సరసన 'డైసీ ఎడ్గర్ జోన్స్'ను ఎంపిక చేసుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు నుంచి ఆమె తప్పుకుంది. దాంతో ఆమె స్థానంలో ఎవరిని తీసుకోనున్నారనేది ఆసక్తికరంగా మారింది.
