Andhra Pradesh: ఈసారి జనసేనకు అవకాశం లేదు!: సినీ నటుడు కృష్ణుడు

  • ప్రతిపక్షంగా వైసీపీ బలంగా ఉంది
  • జనసేన ఎంత ప్రభావం చూపుతుందో చెప్పడం కష్టం
  • ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కృష్ణుడు వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీడీపీ, వైసీపీ కాకుండా మూడో పార్టీకి తగినంత వ్యాక్యూమ్ లేదని సినీనటుడు కృష్ణుడు అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షమైన వైసీపీ బలంగా ఉన్నప్పుడు జనసేన ఎలాంటి ప్రభావం చూపుతుందో చెప్పడం కష్టమన్నారు. 2014లో పవన్ కల్యాణ్ బేషరతుగా చంద్రబాబుకు మద్దతు ఇచ్చారని గుర్తుచేశారు. కానీ ఈరోజు పవన్ ఎన్నిరకాలుగా విమర్శించాలో అన్నిరకాలుగా విమర్శించారని వ్యాఖ్యానించారు.

టీడీపీ 40 సీట్లను వెయ్యి ఓట్ల మెజారిటీతో గెలిచిందనీ, మరో 20-30 సీట్లను 2-3 వేల ఓట్ల తేడాతో దక్కించుకుందని గుర్తుచేశారు. ఇందుకు పవన్ ఫ్యాక్టర్ కూడా ఓ కారణం కావచ్చన్నారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కృష్ణుడు మాట్లాడుతూ.. ఈసారి జనసేనకు తగినంత అవకాశం లేదన్నది తన అభిప్రాయమన్నారు. 1980ల్లో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఎన్టీ రామారావు టీడీపీని పెట్టారనీ, అప్పుడు ఆ వ్యాక్యూమ్ ఉందని అన్నారు. కృష్ణుడు ఇటీవల జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.

Andhra Pradesh
YSRCP
Telugudesam
Jagan
Tollywood
krishnudu
Jana Sena
Pawan Kalyan
  • Loading...

More Telugu News