Andhra Pradesh: బిరియానీ, మందు ఏర్పాటు చేయలేదని శివాజీ బీజేపీకి రాజీనామా చేశాడు!: నటుడు కృష్ణుడు సంచలన ఆరోపణ

  • తాను పెద్ద స్టార్ అని శివాజీ భావిస్తుంటాడు
  • అనంతపురం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో ఆయనకు బస ఇచ్చారు
  • అక్కడే మందు, బిరియానీ కావాలన్నాడు

‘నేను పెద్ద స్టార్’ అని శివాజీ భావిస్తుంటాడని ఇటీవల వైసీపీలో చేరిన నటుడు కృష్ణుడు తెలిపారు. ఆయన క్యారెక్టర్ ఏంటో ప్రపంచం మొత్తానికి తెలుసని వ్యాఖ్యానించారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  కృష్ణుడు మాట్లాడుతూ.. ‘ఆయన గతంలో బీజేపీలో ఉన్నప్పుడు తిరుపతి మీటింగ్ అయ్యాక అనంతపురానికి వచ్చాడు. అనంతపురంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో ఆయనకు బస ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తనకు బరియానీ, మద్యం ఇతరత్రా అరేంజ్ చేయాలని శివాజీ కోరాడు.

దీంతో ఇలాంటివి మేం చేయం అని అస్వర్థ అనే బీజేపీ కార్యకర్త ముఖం మీదే చెప్పాడు. అంతేకాకుండా ఈ విషయాన్ని సదరు కార్యకర్త హైకమాండ్ కు చేరవేశాడు. ఛఛ.. ఇలాంటి పనులు మనం చేయం అని బీజేపీ పెద్దలు కూడా చెప్పారు. దీంతో బీజేపీ నేతల మీద అలిగి శివాజీ ఆ పార్టీకి రాజీనామా చేశాడు’ అని కృష్ణుడు చెప్పారు. అలాంటి శివాజీ క్యారెక్టర్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు నంది అంటే నంది.. పంది అంటే పంది అని శివాజీ అన్న విషయాన్ని గుర్తుచేశారు. తనకు తగినంత మంది వేగులు ఉన్నారనీ, అందువల్లే ఈ విషయాలన్నీ తెలిశాయని చెప్పారు.

Andhra Pradesh
Telugudesam
BJP
sivaji
krishnudu
YSRCP
liquor
biryani
  • Loading...

More Telugu News