sampoornedsh babu: మా ఊళ్లో వాళ్లు అలా అడిగినప్పుడల్లా చాలా బాధనిపిస్తుంది: హాస్యనటుడు సంపూర్ణేశ్ బాబు
- ఇండస్ట్రీకొచ్చి పోగొట్టుకున్నదేమీ లేదు
- వరుసగా సినిమాలు లేకపోతేనే ఇబ్బంది
- వేషాలు ఇస్తామనే అంటున్నారు
హాస్యనటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంపూర్ణేశ్ బాబు, తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ ఒక విషయం చెప్పాడు. "ఇండస్ట్రీకి వచ్చి నేను పోగొట్టుకున్నది ఏమీ లేదు .. నాకు ఎవరి నుంచి ఎలాంటి అవమానాలు ఎదురుకాలేదు కూడా. నేను సినిమా ఆఫీసులకి వెళుతూనే వుంటాను. నాకు తగిన వేషం ఉంటే తప్పకుండా పిలుస్తామనే అంటున్నారు.
ఇక నాకు బాధ అనిపించే విషయం మాత్రం ఒకటి వుంది. "సాధారణంగానే ఒక పది రోజులు షూటింగ్ వుండి .. మళ్లీ రెండు మూడు నెలలు షూటింగ్ లేకపోతే నేను మా ఊరు వెళ్లిపోతుంటాను. అప్పుడు అక్కడున్న వాళ్లు 'ఇప్పుడు సినిమాలు ఏమీ లేవా .. సినిమాలు చేయడం లేదా? .. ఇక్కడే వుంటున్నావ్ వేషాలేం లేవా? సినిమాలు పెద్దగా రావట్లేదంటగా .. వేరే సినిమాల్లో చిన్న పాత్రలు వేస్తే ఏంటి? అంటూ ముఖం మీదే అడిగేస్తుంటారు. అప్పుడు మాత్రం చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది" అని చెప్పుకొచ్చాడు.