Jammu And Kashmir: కశ్మీర్లో ఆరెస్సెస్ నేతపై టెర్రరిస్ట్ కాల్పులు

  • జమ్ముకశ్మీర్ లో టెర్రరిస్టుల ఘాతుకం
  • ఆరెస్సెస్ నేత, సెక్యూరిటీ గార్డుపై కాల్పులు
  • ప్రాణాలు కోల్పోయిన సెక్యూరిటీ గార్డు

జమ్ముకశ్మీర్ లో టెర్రరిస్టులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. కిష్టవార్ పట్టణంలో ఆరెస్సెస్ నేత చంద్రకాంత్ శర్మపై కాల్పులు జరిపారు. జిల్లా ఆసుపత్రిలో ఆయన మెడికల్ అసిస్టెంట్ గా పని చేస్తున్నారు. ఇదే సమయంలో ఆరెస్సెస్ నేతగా కూడా క్రియాశీలకంగా ఉంటున్నారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... ఆయుధాన్ని ధరించిన వ్యక్తి ఆసుపత్రిలోకి ప్రవేశించి చంద్రకాంత్ తో పాటు అతని సెక్యూరిటీ గార్డుపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో సెక్యూరిటీ గార్డు ప్రాణాలు కోల్పోగా... చంద్రకాంత్ శర్మ తీవ్రంగా గాయపడ్డారు.

Jammu And Kashmir
terrorist
fire
  • Loading...

More Telugu News