Andhra Pradesh: ఈసీ తనిఖీలు.. పట్టుబడ్డ నగదులో దేశంలోనే మూడో స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్!
- దేశవ్యాప్తంగా రూ.509 కోట్లు పట్టుకున్నామన్న ఈసీ
- తొలి స్థానంలో హరియాణా, రెండో స్థానంలో తమిళనాడు
- దేశవ్యాప్తంగా 719 కోట్ల రూపాయల డ్రగ్స్ స్వాధీనం
దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ రూ.509 కోట్ల నగదును పట్టుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) తెలిపింది. అలాగే రూ.182 కోట్ల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా రూ.719 కోట్ల విలువైన డ్రగ్స్ ను పట్టుకున్నామని పేర్కొంది. ఢిల్లీలో ఈరోజు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఈసీ అధికారులు ఈ వివరాలను ప్రకటించారు.
ఈ తనిఖీల్లో భాగంగా రూ.414 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఈ జాబితాలో రూ.513.44 కోట్ల నగదుతో హరియాణాలో తొలిస్థానంలో నిలిచినట్లు చెప్పారు. దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడు రూ.401.46 కోట్లతో రెండో స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ఇక పట్టుబడ్డ నగదు విషయంలో రూ.190.3 కోట్లతో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచిందని తెలిపారు.