sampoornesh babu: పూరి అడిగితే నో చెప్పేసి తప్పుచేశాను: నటుడు సంపూర్ణేశ్ బాబు

  • డ్రామాలు .. నాటకాలు ఇష్టం 
  • 'లోఫర్'లో ఛాన్స్ వస్తే నో చెప్పాను 
  • పూరిని కలిసి ఛాన్స్ అడిగాను    

హాస్య నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న సంపూర్ణేశ్ బాబు, తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను గురించి ప్రస్తావించాడు. "మొదటి నుంచి కూడా నాకు నాటకాలు .. డ్రామాలు అంటే ఇష్టం. అలాగే కొంతమంది ఆర్టిస్టుల వాయిస్ తో మిమిక్రీ చేసేవాడిని. ఇలా నటన పట్ల నాకు గల ఆసక్తితోనే ఇండస్ట్రీకి వచ్చాను.

'హృదయ కాలేయం' విడుదలైన తరువాత, పూరి జగన్నాథ్ గారు నన్ను పిలిపించి మరీ, 'లోఫర్' లో ఒక వేషం వేయమన్నారు. ఆ సమయంలో నేను హీరోగా చేసిన 'కొబ్బరిమట్ట' విడుదలయ్యే అవకాశాలు ఉండటంతో .. 'ఇప్పుడు చేయలేను సార్' అని చెప్పాను. అలా పూరి సినిమాలో ఛాన్స్ ను వదులుకోవడమే నేను చేసిన తప్పు అని ఇప్పటికీ అనుకుంటూ వుంటాను. ఆ తరువాత పూరిగారిని కలిసి వేషం ఇవ్వమని అడిగాను .. ఇంతవరకూ ఇవ్వలేదు .. త్వరలో ఇస్తారేమో చూడాలి" అని చెప్పుకొచ్చాడు.

sampoornesh babu
  • Loading...

More Telugu News