Telangana: రేవంత్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఓటేయండి.. తెలంగాణ ఆరెకటిక సేవా సమితి పిలుపు!

  • తెలంగాణ ఉద్యమంలో ఆరెకటికలు చురుగ్గా పాల్గొన్నారు
  • ఇచ్చిన హామీలను కేసీఆర్ నిలబెట్టుకోలేదు
  • వ్యవస్థాపక అధ్యక్షుడు ఈశ్వర్ చౌదరి వ్యాఖ్య

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న తెలంగాణ నేతలు రేవంత్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డిలకు అనూహ్య మద్దతు లభించింది. ఈ ఎన్నికల్లో తాము వీరిద్దరికీ మద్దతు ఇస్తున్నట్లు తెలంగాణ ఆరెకటిక సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కళ్యాణ్‌కార్‌ ఈశ్వర్‌చౌదరి ప్రకటించారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఆరెకటికలు కీలకపాత్ర పోషించారని తెలిపారు.

కానీ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నప్పటికీ టీఆర్ఎస్ ఆరెకటికలకు న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరెకటికలకు న్యాయం చేస్తామన్న కేసీఆర్ మాట నిలుపుకోలేదని దుయ్యబట్టారు. తమ సంక్షేమాన్ని విస్మరించిన టీఆర్ఎస్ కు బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో  రేవంత్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలను గెలిపించాలని కళ్యాణ్‌కార్‌ ఈశ్వర్‌చౌదరి పిలుపునిచ్చారు.

Telangana
Congress
Revanth Reddy
konda visweswar reddy
support
Telangana arekatika samiti
  • Loading...

More Telugu News