tTelugudesam: తెలంగాణలో టీడీపీ తిరుగులేని శక్తిగా అవతరిస్తుంది: రావుల

  • టీడీపీని లేకుండా చేయడం ఎవరి తరం కాదు
  • గ్రామ స్థాయి నుంచి పునర్నిర్మిస్తాం
  • చంద్రబాబుతో చర్చించి కార్యాచరణను ప్రకటిస్తాం

తెలంగాణలో టీడీపీని లేకుండా చేయడం ఎవరి తరం కాదని ఆ పార్టీ నేతలు రావుల చంద్రశేఖర్ రెడ్డి, పెద్దిరెడ్డి, అరవిందకుమార్ గౌడ్ అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొందరు పార్టీని వీడుతున్నారని... వారి వల్ల ఎలాంటి నష్టం లేదని చెప్పారు. ప్రస్తుతానికి ఇబ్బందులున్నప్పటికీ... రానున్న రోజుల్లో టీడీపీ మళ్లీ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని అన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని పునర్నిర్మిస్తామని చెప్పారు. లోక్ సభ ఎన్నికల తర్వాత తమ అధినేత చంద్రబాబుతో చర్చించి... భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. టీడీపీలో ఇన్నాళ్లు టీఆర్ఎస్ కోవర్టులు ఉన్నారని..ఇప్పుడు వారి ముసుగులు తొలగిపోయాయని చెప్పారు. 

tTelugudesam
Telugudesam
ravula
Chandrababu
  • Loading...

More Telugu News