sampoornesh babu: 'హృదయ కాలేయం' చూసినవాళ్లు తిట్టేవారు: సంపూర్ణేశ్ బాబు

  • నా అసలుపేరు నర్సింహాచారి 
  • 10 లక్షలతో సినిమా చేద్దామనుకున్నాము
  •  హైప్ ను నిలబెట్టుకోవడం కోసం బడ్జెట్ పెంచాము  

తెలుగు తెరకి పరిచయమైన హాస్యకథానాయకులలో సంపూర్ణేశ్ బాబు ఒకరు. 'హృదయ కాలేయం' సినిమాతో ఒక్కసారిగా ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తన గురించి అంతా మాట్లాడుకునేలా చేశాడు. తాజాగా ఆయన 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ .. "నా అసలు పేరు నర్సింహా చారి. సినిమా కోసం నా పేరును పరిపూర్ణేశ్ బాబుగా మార్చుకోవాలని అనుకున్నాను. కానీ అంతా సంపూర్ణేష్ బాబు అయితే బాగుంటుందని సూచించడంతో అదే పేరును ఖరారు చేసుకున్నాను.

తొలి సినిమాగా 'హృదయకాలేయం' చేశాను. 80 లక్షలతో నిర్మించిన ఆ సినిమాను కోటి పాతిక లక్షలకి అవుట్ రేట్ కి అమ్మేయడం జరిగింది. అసలు ఈ సినిమాను 10 లక్షలతోనే తీయాలనుకున్నాము. ట్రైలర్ కి మంచి హైప్ రావడంతో, దానిని నిలబెట్టుకోవడానికి ఎక్కువ ఖర్చు పెట్టేశాము. ఈ సినిమా వచ్చిన రెండు మూడు రోజుల వరకూ 'ఏంట్రా ఈ సినిమా ఏంటి .. మీరేంటి' అంటూ తిట్టేవారు. ఆ తరువాత .. తరువాత ఆ సినిమాకి ఆదరణ లభించింది" అంటూ చెప్పుకొచ్చాడు.

sampoornesh babu
  • Loading...

More Telugu News