Ajay Devgan: 14 ఏళ్ల నా కుమార్తెను వదిలివేయండి: ట్రోలర్స్ కు అజయ్ దేవగణ్ వేడుకోలు

  • ఫొటోలు తీసి పబ్లిష్ చేయవద్దు
  • సరిగ్గా కనిపించమేమోనని బాధపడుతున్నారు
  • అసభ్య కామెంట్లు చూసి బాధపడుతున్నారన్న అజయ్

తన కుమార్తె వయసు కేవలం 14 సంవత్సరాలు మాత్రమేనని, తన శరీరాకృతి, వేసుకునే దుస్తులపై ట్రోలర్స్ చేస్తున్న కామెంట్లతో ఆమె ఏడుస్తోందని బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ వాపోయారు. తన పిల్లల ఫొటోలు తీసి వాటిని పబ్లిష్ చేయవద్దని మీడియాను కోరిన అజయ్, ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే నెగటివ్ కామెంట్లు వస్తున్నాయని అన్నారు. తనకున్న పాప్యులారిటీతో తన పిల్లలు బాధపడుతున్నారని, మీడియా శ్రద్ధ చూపిస్తుండటంపై వారు అసహనంతో ఉంటున్నారని అన్నారు.

మీడియా తీస్తున్న ఫొటోల్లో తాము సరిగ్గా కనిపించమేమోనన్న ఆందోళన వారిలో నెలకొని వుందని, పిల్లలన్న సంగతిని కూడా మరిచి అసభ్య కామెంట్లు పెడుతుంటే వాటిని చూసి బాధపడుతున్నారని అన్నారు. తాను, తన భార్య సెలబ్రిటీలం కాబట్టి ఏమన్నా పట్టించుకోబోమని, తమ పిల్లలు ఏం పాపం చేశారని ప్రశ్నించిన ఆయన, తన బిడ్డను వదిలేయాలని కోరారు.

Ajay Devgan
Trollers
Photos
Social Media
  • Loading...

More Telugu News