Ram Madhav: తెలంగాణలో మాత్రం బలం పెరుగుతుంది: బీజేపీ నేత రామ్ మాధవ్!

  • బలపడాలన్న ప్రయత్నం చేస్తున్నాం
  • తెలంగాణలో సీట్లు పెరిగే చాన్స్ ఉంది
  • టీడీపీతో కలిసుండటం వ్యతిరేకమైందన్న రామ్ మాధవ్

దక్షిణాది రాష్ట్రాల్లో మరింతగా బలపడాలన్న ప్రయత్నాలు చేస్తున్నామని బీజేపీ నేత రామ్ మాధవ్ వ్యాఖ్యానించారు. ఓ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, గత ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తమకు 3 లోక్ సభ సీట్లు వచ్చాయని, ఈ దఫా అంతకన్నా ఒకటన్నా ఎక్కువ తెచ్చుకోగలమన్న నమ్మకం ఉందని అన్నారు. ముఖ్యంగా తెలంగాణలో గతంలో ఒక సీటు తెచ్చుకున్నామని, ఈ దఫా మరో రెండు సీట్లైనా అధికంగా వస్తాయని భావిస్తున్నామని తెలిపారు.

ఏపీలోనూ బలోపేతం అవుతున్నామని, గతంలో వచ్చిన రెండు సీట్లనూ నిలుపుకోగలమన్న నమ్మకంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. దక్షిణాదిలో కర్ణాటక మినహా మిగతా రాష్ట్రాల్లో తమ కూటమి పార్టీలతోనే అధికంగా కలిసున్నామని, అధికార పార్టీలతో భాగస్వామ్యాలను నెలకొల్పామని గుర్తు చేసిన ఆయన, ఏపీలో గడచిన ఐదేళ్లలో మూడున్నరేళ్లు టీడీపీతో కలిసున్నామని, అదే తమకు కాస్తంత వ్యతిరేకమైందని అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికలను ఓ మెట్టుగా తీసుకుని తాము పైకి ఎక్కేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. 

Ram Madhav
Andhra Pradesh
Telangana
BJP
  • Loading...

More Telugu News