vangaveeti: కోట్లు ఖర్చు చేయించి.. మోసం చేయడం జగన్ నైజం: వంగవీటి రాధాకృష్ణ

  • ఎమ్మెల్యే టికెట్ ఇస్తానంటూ కోట్లు ఖర్చు పెట్టిస్తారు
  • ఎన్నికల  సమయం వచ్చాక ఎమ్మెల్సీ ఇస్తానంటారు
  • నవరత్నాల్లో ఏ రత్నం ఇవ్వాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు

నమ్మించి నట్టేట ముంచడం వైసీపీ అధినేత జగన్ నైజమని టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని నమ్మించి నాయకుల చేత కోట్లు ఖర్చు చేయిస్తారని... తీరా ఎన్నికల సమయం వచ్చాక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా, ఎమ్మెల్సీ ఇస్తానంటూ మోసం చేస్తారని మండిపడ్డారు. నవరత్నాలను ప్రకటించిన జగన్... ఏ రత్నం ఇవ్వాలో తెలియక అయోమయానికి గురవుతున్నారని అన్నారు. ప్రకాశం జిల్లాలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ, రాధా ఈ వ్యాఖ్యలు చేశారు.

vangaveeti
radha
jagan
Telugudesam
ysrcp
  • Loading...

More Telugu News