YSRCP: ఏపీలో గెలిచేది జగన్... వీడీపీ అసోసియేట్స్ సర్వే!
- వైసీపీకి 106 నుంచి 118 సీట్లు
- 54 నుంచి 68 సీట్లకు టీడీపీ పరిమితం
- జనసేనకు 1 నుంచి 3 సీట్లే: వీడీపీ
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో 106 నుంచి 118 సీట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుని ప్రభుత్వాన్ని స్థాపించనుందని వీడీపీ అసోసియేట్స్ తన సర్వే ఫలితాలను ప్రకటించింది. వైసీపీకి 43.85 శాతం ఓట్ షేర్ వస్తుందని, ప్రస్తుత అధికార తెలుగుదేశం పార్టీ 40 శాతం ఓట్ షేర్ కు పరిమితమై 54 నుంచి 68 సీట్లను పొందవచ్చని అంచనా వేసింది.
ఇక జనసేనకు 9.80 శాతం ఓట్లు రావచ్చని 1 నుంచి 3 సీట్లలో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించవచ్చని అంచనా వేసింది. మిగతా పార్టీలకు 0.40 నుంచి 2.40 శాతం వరకూ ఓట్లు వస్తాయని, వారికి దక్కే సీట్లు లేవని తెలిపింది.
ఇక కులాల వారీగా కూడా విశ్లేషించిన వీడీపీ అసోసియేట్స్, కాపు, బలిజ, కమ్మ, బ్రాహ్మణ వర్గాలు టీడీపీ వైపు ఉండగా, రెడ్డి, వైశ్య, క్షత్రియ/రాజు, వెలమ, ముస్లిం, మాల, మాదిగ, ఆదివాసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపున్నారని పేర్కొంది.