Andhra Pradesh: ‘హోదా’కు మద్దతు సరే, మరి అసెంబ్లీలో తీర్మానం చేస్తారా?: కేసీఆర్ కు వర్ల రామయ్య సూటి ప్రశ్న

  • అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తారా?
  • కేసీఆర్ చెప్పేదొకటి, చేసేదొకటి
  • ఈ ఎన్నికల్లో టీడీపీ మళ్లీ విజయం ఖాయం

ఏపీకి ప్రత్యేక హోదాకు టీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ కొద్ది సేపటి క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనపై ఏపీ టీడీపీ నేత వర్ల రామయ్య స్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై కేవలం మద్దతు ఇస్తామని ప్రకటించడం కాదని, అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తారా? అని సూటి ప్రశ్న వేశారు.

 పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆపాలని కోరుతూ టీఆర్ఎస్ ఎంపీ కవిత సుప్రీంకోర్టులో కేసు వేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. కేసీఆర్ చెప్పేదొకటి చేసేదొకటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్నికల గురించి ఆయన మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో టీడీపీ మళ్లీ విజయం సాధించడం, చంద్రబాబు తిరిగి సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Andhra Pradesh
Telangana
special status
kcr
varla
Ramaiah
polavaram
project
TRS
  • Loading...

More Telugu News