Shivaji: మోదీపై ప్రేమతో జగన్‌ని బలిపశువుని చేయబోతున్నారా?: కేసీఆర్‌పై సినీ నటుడు శివాజీ ఫైర్

  • కేసీఆర్ ఒక జిత్తులమారి నక్క
  • ఆంధ్రులెవరూ ఆయన మాట నమ్మరు
  • జగన్‌కి కేసీఆర్, కేటీఆర్ సాయం చేస్తున్నారు
  • కలిసి పని చేయడం తప్పు కాదు

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై సినీ నటుడు శివాజీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నేటి సాయంత్రం ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్, ఏపీ ఎన్నికలపై స్పందించారు. కేసీఆర్ వ్యాఖ్యలపై శివాజీ ఫైర్ అయ్యారు. నేడు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ ఒక జిత్తులమారి నక్క అని, ఆంధ్రులెవరూ ఆయన మాట నమ్మరని వ్యాఖ్యానించారు. వైసీపీ అధినేత జగన్‌తో కలిసి కేసీఆర్ ప్రత్యేక హోదా డ్రామాలాడుతున్నారని దుయ్యబట్టారు.

కేసీఆర్‌కు దమ్ముంటే జగన్‌కు మద్దతిస్తున్నామని చెప్పాలన్నారు. మోదీ ప్రధాని కావడానికి ఏపీ ప్రజలు బలి కావాలా? అని నిలదీశారు. జగన్‌కి కేసీఆర్, కేటీఆర్ సాయం చేస్తున్నారని శివాజీ ఆరోపించారు. రోజూ సాయంత్రం జగన్ హైదరాబాద్‌కు వెళుతున్నారని, కలిసి పని చేయడం తప్పు కాదని, కుట్రలు చేయడం తప్పన్నారు. మోదీపై ప్రేమతో జగన్‌ను బలిపశువుని చేయబోతున్నారా? అంటూ కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు. ఏపీ ప్రజలను అవమానించిన కేసీఆర్‌కు తిరిగి సమాధానం చెప్పే రోజు వస్తుందని ఆయన వెల్లడించారు. కేసీఆర్‌ను ఎందుకు నమ్మాలో ప్రజలు ఆలోచించాలన్నారు. అసదుద్దీన్ మతం పేరుతో ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని శివాజీ విమర్శించారు.

Shivaji
Jagan
KCR
Narendra Modi
Andhra Pradesh
KTR
  • Loading...

More Telugu News