Pawan Kalyan: దేవుడి సొమ్మును కూడా స్వాహా చేశారు.. అంత కక్కుర్తి ఎందుకు?: పవన్

  • బుచ్చయ్య చౌదరి ఓడిపోతారు
  • బీజేపీ, కాంగ్రెస్ తర్వాత బీఎస్పీనే
  • కోవర్టులను పంపిస్తే సహించేది లేదు

రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ ఎన్నికల్లో ఓడిపోతారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ జోస్యం చెప్పారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన ఎన్నికల శంఖారావ సభలో పవన్‌ మాట్లాడుతూ, గోదావరి పుష్కరాల నిధులతో పాటు దేవుడి సొమ్మును కూడా కొందరు స్వాహా చేశారని అంత కక్కుర్తి ఎందుకని మండిపడ్డారు.

బీజేపీ, కాంగ్రెస్ తరువాత జాతీయ పార్టీ బీఎస్పీనే అని పవన్ అభిప్రాయపడ్డారు. మార్పు కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని, పార్టీల తరుపున కోవర్టులను పంపిస్తే సహించేది లేదన్నారు. ఎందరో నేతలు రాజకీయాల్లో మార్పు కోరుకుంటున్నారని పవన్ అభిప్రాయపడ్డారు. సచార్ కమిటీ సిఫార్సులు అమలు చేసేలా ఒత్తిడి తెస్తామన్నారు.

Pawan Kalyan
Gorantla Butchaiah Chowdary
Janasena
BJP
Congress
BSP
  • Loading...

More Telugu News