Chandrababu: ​అభ్యర్థులు కానీ, కార్యకర్తలు కానీ, అధికారులు కానీ చిన్న తప్పు చేసుంటే అందుకు నన్ను బలిచేయొద్దు: చంద్రబాబు విజ్ఞప్తి​

  • పామర్రులో చంద్రబాబు ప్రసంగం
  • నన్ను చూసి ఓటేయండి
  • దేవెగౌడపై పొగడ్తల జల్లు

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లా పామర్రులో బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, తన పార్టీ అభ్యర్థులు కానీ, కార్యకర్తలు కానీ, అధికార యంత్రాంగం కానీ ఎప్పుడో చిన్న తప్పు చేసుంటే, దాన్ని దృష్టిలో పెట్టుకుని టీడీపీకి ఓటేయకపోతే అది తనకు నష్టదాయకం అని, రాష్ట్రానికి నష్టం అని, పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుందని అన్నారు.

"నన్ను చూసి ఓటేయండి. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో నేను అభ్యర్థిని. ఎంపీగా, ఎమ్మెల్యేగా మీరు నన్ను చూడండి. విభేదాలను దృష్టిలో పెట్టుకుని టీడీపీకి ఓటేయకుండా ఉంటే అందరం దెబ్బతింటాం. పామర్రును కుప్పం కంటే మెరుగ్గా తీర్చిదిద్దుతా" అంటూ హామీ ఇచ్చారు. ఇక, వేదికపై ఉన్న మాజీ ప్రధాని దేవెగౌడపై పొగడ్తల జల్లు కురిపించారు. బెంగళూరులో ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ మనకోసం వచ్చారంటూ కొనియాడారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ, విపక్షనేత జగన్ పై విమర్శలు చేశారు. జగన్ తన మేనిఫెస్టోలో రాజధాని అమరావతి గురించి కనీస ప్రస్తావన కూడా చేయలేదని మండిపడ్డారు. జగన్ గెలిస్తే రాజధానిగా అమరావతి ఉండదని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News