Sivaji: భవిష్యత్తులో జగన్‌పై కేసులు నిరూపణ అయితే ఏంటి పరిస్థితి?: సినీ నటుడు శివాజీ

  • అమరావతిపై వైఖరిని ఎందుకు స్పష్టం చేయట్లేదు?
  • కేసీఆర్‌తో కలిసి హోదా సాధిస్తాననడం హాస్యాస్పదం
  • ఏపీకి రావలిసిన ఆస్తులను రాయించుకు రావాలి

భవిష్యత్తులో వైసీపీ అధినేత జగన్‌పై కేసులు నిరూపణ అయితే ఏంటి పరిస్థితి? అని సినీ నటుడు శివాజీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నేడు ఆయన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఎంపీ మురళీమోహన్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ అమరావతిపై జగన్ తన వైఖరిని స్పష్టం చేయకపోవడానికి కారణమేంటంటూ నిలదీశారు. తన గొయ్యి తానే తవ్వుకుంటున్నట్టు జగన్ వ్యవహరిస్తున్నారని శివాజీ విమర్శించారు.

ఏపీ ప్రయోజనాలు ఏమాత్రం సహించని కేసీఆర్‌తో కలిసి హోదా సాధిస్తాననడం హాస్యాస్పదమన్నారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి రావల్సిన ఆస్తులను కేసీఆర్ నుంచి రాయించుకు రావాలని జగన్‌ను శివాజీ కోరారు. అలాగే పోలవరానికి అడ్డుపడబోనని, కృష్ణా జలాల్లో రాయలసీమ వాటాను హరించబోనని కూడా రాయించుకురావాలని సూచించారు. యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ ఏపీకి ప్రత్యక హోదా ఇస్తామంటూ గతంలో చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన కేసీఆర్‌తో కలిసి హోదా సాధిస్తానంటే ఎలా నమ్మాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Sivaji
Jagan
KCR
Murali Mohan
Andhra Pradesh
Sonia Gandhi
  • Loading...

More Telugu News