YSRCP: ప్రతి కులాన్నీ టీడీపీ మోసం చేసింది: వైఎస్ జగన్

  • గతంలో ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చలేదు
  • మళ్లీ హామీ లిచ్చి ప్రజలను మోసం చేస్తున్నారు
  • మేము అధికారంలో కొస్తే ‘నవరత్నాలు’ అమలు చేస్తాం

గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చని చంద్రబాబు మళ్లీ ఇప్పుడు అదే మాదిరి హామీలిచ్చి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, 2014 టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్కో కులానికి ఒక పేజీనీ కేటాయించారని, అధికారంలోకి వచ్చాక ప్రతి కులాన్ని టీడీపీ మోసం చేసిందని మండిపడ్డారు.

ఈ సందర్భంగా 2014 టీడీపీ మేనిఫెస్టోలోని ఒక పేజీని జగన్ చదివి వినిపించారు. ఆ పేజీలో వ్యవసాయ రుణాల మాఫీ, ఐదు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి, పొదుపు సంఘాల రుణాల మాఫీ వంటి హామీలు ఉండటం గమనార్హం. ఈ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వస్తే ‘నవరత్నాలు’ అమలు చేస్తామని, ప్రతి ఒక్కరి ముఖంలో నవ్వు చూస్తామని జగన్ హామీ ఇచ్చారు.

YSRCP
jagan
Telugudesam
elections
Eluru
  • Loading...

More Telugu News